కూటమి పాలనతో ఆంధ్రప్రదేశ్ కు శుభ ఘడియలు ప్రారంభమయ్యాయని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. మంగళవారం చందర్లపాడు, నందిగామ రూరల్ టౌన్ క్లస్టర్ యూనిట్ పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో విడివిడిగా సమావేశమయ్యారు. అందరూ బాధ్యత వహించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రుల ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు.