చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన బూరుగు రవికుమార్ కు రెండు రోజుల క్రితం కాలు విరిగి మంచాన బాధపడుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న మాలయోధుల సంక్షేమ సంఘం అతనిని పరామర్శించి పదివేల రూపాయల నగదును వైద్య ఖర్చుల నిమిత్తం సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్క రాము, ధారా రాజు, వినోదు, విజయరాజు, రాజేష్, రమేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.