రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ని అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని బొడ్డపాడు సర్పంచ్ మూడే శివశంకర్ పేర్కొన్నారు. శనివారం తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, గ్రామంలో ఉన్న ఇంటి విద్యుత్ కనెక్షన్లు వేరు చేస్తూ కొత్త కరెంటు లైన్లు, కొత్త ట్రాన్స్ ఫారాలు ఏర్పాటు చేసే కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ మూడే శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.