పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో శనివారం సర్ధార్ గౌతు లచ్చన్న మనవరాలు, పలా స ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించారు. స్థానికంగా ఉన్న తాత లచ్చన్న విగ్రహంకు శిరీష పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక బిసి నాయకులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, బిసి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.