గూడూరు: ‘జనసేన నాయకులను అవమానించారు'

71చూసినవారు
గూడూరు మండలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న గ్రామసభను బహిష్కరించాలని గూడూరు మండల జనసైనికులు పిలుపునిచ్చారు. గూడూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో మండల కార్యకర్తలు విసిగిపోతున్నారని, జనసేన నాయకులకు అవమానం జరిగిందన్నారు. ఇందుకు నిరసనగా పెడన నియోజకవర్గ జనసైనికుల పిలుపుమేరకు ఈ గ్రామసభను బహిష్కరించాలని ఆదివారం రాత్రి జనసేన నాయకుడు సంతోష్ కోరారు.

సంబంధిత పోస్ట్