పెడన: నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వినతి

59చూసినవారు
పెడన: నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వినతి
పెడన నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్