కృష్ణా జిల్లాలో శనివారం ఉదయం నుంచే నీటి సంఘాల ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. జిల్లాలోని పెడన నియోజకవర్గం నందిగామ నీటి సంఘాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వంలో చీలిక ప్రారంభమైంది. నీటి సంఘానికి తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటేశ్వరరావు, జన్ను ప్రసాద్ (కొండా) రెబల్ అభ్యర్ధిగా శనివారం పోటీకి దిగారు. దీంతో నందిగామ డిసి ఎన్నిక వాడివేడిగా కొనసాగానుంది.