రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంపై గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు చేసిన నిరాధార ఆరోపణలు తగవని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. ఆదివారం తాడిగడప లోని మంత్రి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూజివీడు నియోజకవర్గ టిడిపి నాయకులు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ గురించి నిరాధార ఆరోపణలు చేయటం తగదన్నారు.