కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గంలోని కంకిపాడు మండలంలోని ఉప్పులూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కోడి పందేల శిబిరాలను శనివారం కంకిపాడు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కంకిపాడు సిఐ హెచ్చరించారు.