కంకిపాడులోని భద్రాచలం వీధిలో మధ్యలో నిలిచిపోయిన పనులను బుధవారం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించి నేరుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోడే స్వయంగా స్థానికుల దగ్గరకు వెళ్ళి పనులు నిలిచిపోవడంపై మాట్లాడి రోడ్డును మేరక చేసి పక్కా రోడ్డు, డ్రైయినేజీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా భద్రాచలం వీధిలో డ్రైయిన్, సీసీ రోడ్డు నిర్మాణంపై స్థానికుల నుంచి పిర్యాదులు అందాయి.