తిరువూరు మండలంలోని ఏరుకోపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కోడిపందేలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది. భారీగా ద్విచక్రవాహనాలు పోలీసులకు పట్టుబడ్డాయి.