పెనుగొలను: అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు

55చూసినవారు
పెనుగొలను: అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు
గంపలగూడెం మండలం పెనుగొలను హై స్కూల్లో సోమవారం ‌అంగన్వాడి కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలకు వస్తున్న 3 నుంచి 6 ఏళ్ల‌ లోపు వయసున్న చిన్నారులకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను నేర్పేవిధానంలో మెళుకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పీవీడీఎల్. నరసింహారావు, ఐసీడీఎస్ పర్యవేక్షణా అధికారులు సిహెచ్. రేవతి కుమారి, వై. ముని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్