గంపలగూడెం మండలం పెనుగొలను లో శివాలయంలో మూడు రోజులు పాటు జరుగు శివరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు దాములూరు రామలింగేశ్వర శర్మ, సత్యనారాయణ శర్మ గణపతి పూజ, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి గ్రామదేవత ముత్యాలమ్మ వారికి అభిషేకం చేసి నూతన వస్త్రాల అలంకరణ చేశారు.