ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పట్టపగలే ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి వైన్ కొనుగోలు చేయడానికి షాపు ముందు తన వాహనాన్ని ఆపి షాపులోకి వెళ్లాడు. ఇదే అదనుగా ఓ యువకుడు వచ్చి వాహనంలో సైడ్ బ్యాగులో పెట్టిన నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అవగా వైరల్‌గా మారాయి.