తిరువూరు రెవిన్యూ డివిజన్ లో కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీఓ కే.మాధురి బుధవారం తెలిపారు. తిరువూరు జడ్పీహై స్కూల్ లో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను ఆర్డీఓ కే.మాధురి పరిశీలించారు. ఏ.కొండూరు, గంపలగూడెం, విసన్నపేట, రెడ్డిగూడెం మండలాల్లో మొత్తం 12 సెంటర్ లలో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.