తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటియు మండల కార్యర్శి బి. వెంకటేశ్వరరావు, మాట్లాడుతూ శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని, సచివాలయాల్లో, నగర పంచాయతీ కార్యాలయంలో టాయి లెట్స్ శుభ్రం చేసి వాడకానికి అందు బాటులోకి తీసుకురావాలని తదితర డిమాండ్లతో కమీషనర్ లోవ రాజుకు వినతి పత్రం అందజేశారు.