తిరువూరు: గుండెపోటు బాధితులకు ఉచితంగా ఇంజక్షన్‌

63చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ గార్గే బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఆసుపత్రులలో గుండెపోటు వచ్చినవారు గంట ముందు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, ప్రాణాన్ని కాపాడటానికి 40 వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్ ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్