తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన విధించిన డెడ్ లైన్ పూర్తికానుంది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించుకుంది.