విద్యుత్ ఘాతంలో ప్రాణాలు విడిచిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని మంగళవారం విజయవాడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబయలు మండలం కిముడుపల్లెలో విద్యుత్ షాక్ తో తల్లి, కుమారుడు, కుమార్తె. ఇలా ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. మృతుల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.