డిసెంబర్ 31వ తేదీ ముసుగులో అర్ధరాత్రి పూట బైక్ లతో విన్యాసాలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మద్యం మత్తులో రోడ్ లపై వికృత చేష్టలు చేస్తూ ప్రమాదాల బారిన పడి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచోద్దని యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బెజవాడ నజీర్ యువతను కోరారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని స్నేహపూర్వకమైన వాతావరణంలో స్వాగతం పలకండని హితువు పలికారు.