ఉద్యోగులు, కార్మికులు నిరంతరం అంకితభావంతో పనిచేయడం వల్లనే కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎదిగిందని సొసైటీ పాలకవర్గ సభ్యులు కొనియాడారు. క్రమశిక్షణతో వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు. విజయవాడ పరిధిలోని గవర్నర్ పేట బాలోత్సవ భవన్ లో ఆదివారం రజతోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు.