సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన జగదీష్

1812చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన జగదీష్
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వపు విప్ సామినేని ఉదయభాను తో కలసి పట్టణ వైకాపా అధ్యక్షుడు చౌడ వరపు జగదీష్ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జగదీష్‌ను పేరుతో పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చౌడవరపు జగదీష్ విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల అనంతరం నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లు కౌన్సిలర్లుతో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసే క్రమంలో కొద్ది సేపు మాట్లాడడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ఆర్యవైశ్య కులస్తులకు ఈ బీసీ పథకం ద్వారా దేశంలో మొట్టమొదటి సారిగా ఓసీలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్