గతంలో సంభవించిన అధిక వర్షాలు వరదల కారణంగా నందిగామ నియోజకవర్గంలో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారని, వారిని తక్షణమే ఆదుకోవాలని ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయం రైతు శిక్షణ కేంద్రం భవనంలోమాట్లాడుతూ, గతంలో సంభవించిన విపత్తుతో మునేరు వరదతో నందిగామ నియోజకవర్గంలో పంటపొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతంగం తీవ్ర నష్టాల పాలయ్యారని తెలిపారు.