పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందన్నారు. పేదవానిఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో కాలనీలలో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లేఅవుట్ ను గురువారం మంత్రి కొలుసు పార్ధ, వసంత కలిసి పరిశీలించారు.