ఆదోనిలో ప్రజాసమ్యలను వేగంగా పరిష్కరించాలని ఇన్ ఛార్జ్ డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్‌డేలో ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి అర్జీలను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఆదోని మండలం దొడ్డనకేరికు చెందిన బీ ఫహద్ తన పొలంలో సర్వే చేయించాలని కోరారు. 15వ వార్డు వైఎంకె నగర్‌లో తాగునీరు రావడంలేదని లక్ష్మి, అసియా, నాగమ్మ, అర్జీ సమర్పించారు.