గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం వల్ల గుండె పదిలంగా ఉంటుంది అని తెలిపారు.