సి. బెళగల్ మండలంలోని కంబందహల్, సి. బెళగల్, బురాన్ దొడ్డి గ్రామాల్లో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను హౌసింగ్ ఏఈ సుమంత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సి. బెళగల్ మండలంలోని గృహ నిర్మాణ లబ్దిదారులు గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్ రంగన్న, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.