కర్నాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

77చూసినవారు
కర్నాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
కోసిగి మండలంలోని కందుకూరు గ్రామ శివారుల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద అక్రమంగా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు సెబ్ సీఐ మహబూబ్ బాషా బుధవారం తెలిపారు. నిందితుడి నుంచి ఓ బైక్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ జైలుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్