ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సకాలను అందిస్తామని కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్లోరికల్చర్ లో భాగంగా నాటిన మల్లే, గూలాబీ తోటలను ఆయన పరిశీలించి, అనంతరం వారు మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటల సాగుకు అర్హులైన రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.