

కల్లూరు: పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ సీఐటీయూ నిరసన
పని దినాన్ని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచిన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని సీఐటీయూ నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు తీవ్రంగా ఖండించారు. గురువారం కల్లూరు అర్బన్ పరిధిలోని సుందరయ్య సర్కిల్ వద్ద నిరసన నిర్వహించిన నాయకులు మహిళల రాత్రి షిఫ్ట్‌లు అమానుషమని మండిపడ్డారు. కేంద్ర లేబర్ కోడ్లను అనుసరించిన తుగ్లక్ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.