ఆదోని పట్టణంలోని నేషనల్ నర్సింగ్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబిర్ బాషా డిమాండ్ చేశారు. శనివారం ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు సర్కిల్‌లో నిరసన తెలిపారు. కనీసం బిల్డింగ్ లో కూడా లేదని రేకుల షెడ్డులో నడిపిస్తున్నారన్నారు. అధికారులు తనిఖీలు చేసి, విద్యార్థులకు ఫీజులను వెనక్కి ఇప్పించాలని కోరారు. లింగప్ప, దస్తగిరి, శేఖర్, తదితరులు ఉన్నారు.