ఆదోని: రైతుల సేవల్లో కూటమి ప్రభుత్వం ఉంటుంది: ఎమ్మెల్యే

60చూసినవారు
ఆదోని: రైతుల సేవల్లో కూటమి ప్రభుత్వం ఉంటుంది: ఎమ్మెల్యే
రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. సోమవారం ఆదోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో మండల పరిధిలోని పలు గ్రామాల నుండి నియామకమైన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎమ్మెల్యే సన్మానించి, మాట్లాడారు. రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్