ఆదోని: విధుల పట్ల నిర్లక్ష్యంపై ఎంఈవోపై చర్యలకు ఆదేశాలు

64చూసినవారు
ఆదోని: విధుల పట్ల నిర్లక్ష్యంపై ఎంఈవోపై చర్యలకు ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు 14 రోజులైనా ఓపెన్ చేసి చూడని ఆదోని ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. కర్నూలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ లాగిన్ వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని అధికారులను సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్