ఆదోని: భూకబ్జాల విముక్తి కోసమే రెవెన్యూ సదస్సులు

85చూసినవారు
భూకబ్జాల నుంచి ప్రజలను, రైతులను విముక్తి చేయడానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. శుక్రవారం భూ రెవెన్యూ సదస్సులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో విరుపాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సదస్సుల్లో వచ్చిన అర్జీలను 45 రోజుల్లోపు పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్