మహిళలకు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. గురువారం విజయవాడలోని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కు ఎమ్మెల్యే పార్థసారథి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదోని పట్టణంలో మరుగు దొడ్లు నిర్మిస్తానని ఎన్నికల్లో చేస్తామని హామీ ఇచ్చానని, నిధులు విడుదల చేయాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే అన్నారు.