టర్పెంటాయిల్ తాగి చిన్నారికి అస్వ‌స్థ‌త‌

10985చూసినవారు
టర్పెంటాయిల్ తాగి చిన్నారికి అస్వ‌స్థ‌త‌
వాట‌ర్ అనుకొని టర్పెంటాయిల్ తాగి చిన్నారి అస్వ‌స్థ‌త‌కు గురైన సంఘ‌ట‌న ఆదోని మండ‌లం అల‌సంద‌గుత్తిలో బుధ‌వారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివ‌రాల మేర‌కు తండ్రి వృత్తిరిత్యా పెయింట‌ర్‌. ఇంటికి రంగులు వేసేందుకు తెచ్చిన టర్పెంటాయిల్‌ను కుమారుడు అఖిల్ తాగేశాడు. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదోని ప్ర‌భుత్వ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం డాక్ట‌ర్లు క‌ర్నూలుకు రెఫ‌ర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్