ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం కేంద్రంలో జరుగుచున్న రెవెన్యూ సదస్సును ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సచివాలయాన్ని సందర్శించి, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో రైతుల ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు.