యువతకు నియామక పత్రాలు అందజేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ పట్టణంలో ఎక్కడా కూడా నిరుద్యోగ యువతి యువకులు ఉండకూడదనే ఉద్దేశంతో ఐటీ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో సంప్రదించి జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఎంపిక అయిన నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.