ఆలూరు: సీఐగా వెంకట చలపతి నియామకం
ఆలూరు సీఐగా వెంకట చలపతిని నియమించడంతో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు సీఐగా ఉన్న శ్రీనివాస నాయక్ ను వీఆర్ కు పంపడంతో, ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా నుంచి సీఐ వెంకట చలపతి బదిలీపై నియామకం అయ్యారు. అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేసి, శాంతి భద్రతలను గాడిలో పెడతామని ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధిలు సహకరించాలని నూతన సీఐ అన్నారు.