కోవెలకుంట్ల: సీసీ రోడ్ల పనులను తనిఖీ చేసిన ఈఈ
కోవెలకుంట్ల మండలంలో పలు సీసీ రోడ్ల పనులను డ్రైనేజీ పనులను నంద్యాల పిఐయు డివిజన్ ఈఈ రఘురామిరెడ్డి గురువారం తనిఖీ చేశారు. మండలంలోని లింగాల రేవనూరు ఉప్పులూరు గ్రామాల్లో జరుగుతున్న రోడ్లు డ్రైనేజీ పనులను ఈఈ రఘురామిరెడ్డి తనిఖీ చేశారు. పనులు నాణ్యతగా జరగాలని మరింత వేగవంతంగా జరగాలని ఈఈ రఘురామిరెడ్డి కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.