మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు గురువారం వెండి గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళ హారతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. విద్యుత్ కాంతుల మధ్య గజవాహనం ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.