నంద్యాల జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ మాఘం గౌతమ్ ఆదివారం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అంధుల హాస్టల్ కు నిత్యవసర సరుకులను అందజేశారు. దివ్యాంగులకు మందుల పంపిణీ చేశారు. అర్హులైన వారికి కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, పేదలకు ఉగాది కానుక, రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ గవర్నర్ గౌతమ్ నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.