
నంద్యాల: గ్రంథాలయానికి న్యాయ శాస్త్ర పుస్తకాల వితరణ
నంద్యాల పట్టణంలోని పింగళి సూరన శాఖా గ్రంథాలయానికి ఆదివారం న్యాయ శాస్త్ర పుస్తకాలు అందజేసినట్లు రోటరీ విద్యా సంస్థల అధినేత సుబ్బయ్య తెలిపారు.ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న మిత్రుడు నీలకంఠేశ్వర రెడ్డి సహకారంతో లాయర్లకు, న్యాయ శాస్త్రం అభ్యసించే వారికి ఉపకరించే పుస్తకాలను గ్రంథాలయ అధికారి ఎస్.రాధాభాయికి అందజేసినట్లు తెలిపారు.పాఠకులు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు.