
నంద్యాలలో తప్పిన పెను ప్రమాదం
నంద్యాల పట్టణంలోని వెంకటేశ్వరపురం వద్ద కారు అదుపుతప్పి పక్కకు వెళ్ళింది. ఆదివారం కర్నూల్ నుండి నంద్యాల వైపు వస్తుండగా వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ పక్కన ఉన్న సర్వీసు రోడ్డు వైపు వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ సరిగా లేకపోవడంతో అదుపుతప్పి సైడ్ కు వెళ్ళింది. ఈ క్రమంలో వెనకాల వస్తున్న లారీ కారుని ఆనుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయాలన్నారు.