నంద్యాలలో అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని ధర్నా

51చూసినవారు
నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని దళిత సంఘాల నేతలు మంగళవారం ధర్నా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా సమావేశం హాలు ముందు వారు ధర్నా నిర్వహించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ వారి వద్దకు చేరుకొని సమావేశం అనంతరం మీతో చర్చిస్తానన్నారు. నంద్యాల జిల్లా అయి మూడు సంవత్సరాలైనా అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించలేదని నేతలుడిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్