నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో బుధవారం మాఘమాస పౌర్ణమి, శ్రీ లలితా దేవి జయంతి వేడుకలను యోగనంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం యోగా గురువు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృత అభిషేకం, తదనంతరం లోకకళ్యాణార్థం ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి గావించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.