నంది రైతు సమాఖ్య సలహాదారులు రవీంద్రనాథ్ నేతృత్వంలో బుధవారం నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య వారి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి బ్రహ్మానంద రెడ్డి చేస్తున్న సేవలు మరపురానివని రైతు సమాఖ్య నాయకులు తెలిపారు. రైతు సమాఖ్యకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.