పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం పత్తికొండ పట్టణంలో అధికారులు స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాలుగు స్థంభాల కూడలి ప్రాంతంలో ఆర్డీవో భరత్ నాయక్తో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎంపీడీవో సువర్ణలత పాల్గొన్నారు.