నూతన సంవత్సర వేడుకలపై విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ అర్బన్ సీఐ జయన్న సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిసెంబర్ 31న రోడ్లపై అతివేగం, ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసివేసి నడపడం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని సూచించారు. ట్రాఫిక్ జామ్ చేసేలా వ్యహరిస్తే చర్యలు తప్పవన్నారు.