కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, 2 పెద్ద గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన సాకలి రామకృష్ణ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాత శివాలయం వెనక పాకాలలో ఉన్న, గొర్రె పిల్లల వద్ద ఎవరూ లేని సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపాయని రూ. 2 లక్షలు దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.